ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేయాలి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లో నేడు (బుధవారం) వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 19 చెరువుల వద్ద నిమజ్జనం జరగనుంది. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రముఖంగా చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం, గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, మామునూరు బెస్తం చెరువు వద్ద నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చె రువు, గోపాలపురం, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్ల సింగారం, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శాఖల వారీగా ఏర్పాట్లు ఇలా..
● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగసముద్రం 6, బెస్తం చెరువు 2, ఖిలా వరంగల్ అగర్తలా ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 1, బంధం చెరువుల వద్ద 3, హసన్‌పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి తదితర విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు.
● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్ వర్క్‌లు, రోడ్డ విస్తరణరే రూ.కోటి ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద విద్యుత్ లైట్లతో జిగేల్‌మనేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మంచి నీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
● ఎన్‌పీడీసీఎల్ అధికారులు నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచారు.
గ్రేటర్ నగరంలో
నేడు వినాయక నిమజ్జనం
జల వనరుల వద్ద 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు
శోభాయాత్ర దారిలో వీధిదీపాలు, ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన బల్దియా అధికారులు
హన్మకొండ అర్బన్: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ టెలికాన్ఫన్స్‌లో అధికారులకు సూచనలిచ్చారు.


