● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
పరకాల: పరకాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాలను కలెక్టర్ సందర్శించి వాటి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాత ఆస్పత్రి నుంచి నూతన ఆస్పత్రిలోకి అన్ని విభాగాలను తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నందు పటేల్, పరకాల ఆర్డీఓ డీఎస్.వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు.
అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలి..
హన్మకొండ అర్బన్: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, చేయూత పింఛన్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, అన్ని మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు.
టీబీ నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి..
టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


