వివరాలు నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వివరాలు నమోదు చేసుకోవాలి

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

వివరాలు నమోదు చేసుకోవాలి

ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, గోపి ముఖ్య అతిథులుగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు రైతు గుర్తింపు నంబర్‌ కోసం ఫార్మర్‌ రిజిస్ట్రీ ఏఈఓ వద్ద కానీ, మీసేవ సెంటర్‌ వద్ద, లేక కామన్‌ సర్వీస్‌ సెంటర్ల వద్ద చేసుకోవాలని సూచించారు. రైతు గుర్తింపు నంబర్‌ ఉంటే ఎరువులు కొనడానికి, పంట అమ్ముకోవడానికి, బ్యాంక్‌ రుణం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. లేకపోతే పైవాటికి అనర్హులని పేర్కొన్నారు. ఈనెల 22నుంచి 30వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రైతు గుర్తింపు నంబర్‌ కోసం ఫార్మర్‌ రిజిస్ట్రీ చేపట్టినట్లు తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సింగిల్‌విండో చైర్మన్‌ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డిని ఘనంగా సన్మానించారు. సూరారం గ్రామానికి చెందిన హింగె భాస్కర్‌ తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఇటీవల స్వర్ణనంది అవార్డు తీసుకున్న సందర్భంగా హింగె భాస్కర్‌ను సైతం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్‌, ఏఈఓలు పున్నంచందర్‌, బాబు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement