కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ వాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ వార్డు పరిశీలన..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ పరిశీలించారు. ఆదివారం ఈ వార్డులో ఉన్న పలువురు పేషంట్లు, అటెండెంట్లపై సీలింగ్ పెచ్చులు ఊడిన విషయం విదితమే. దీంతో నేరుగా తెలుసుకోవడానికి వార్డుకు వచ్చారు. లోపలికి మీడియాను, ఇతర అధికారులను అనుమతించకుండా జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ


