హన్మకొండ అర్బన్: ప్రజావాణికి అందిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ రవి అర్జీలు స్వీకరించారు. జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల స్థాయిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 298 అర్జీలు అందాయి. వాటిలో కలెక్టరేట్‌లో 130, ఆర్డీఓ కార్యాలయంలో 32, మండల కార్యాలయాల్లో 136 దరఖాస్తులు అందాయి. అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎ ప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్చువల్ విధానంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడి అర్జీల పరిష్కారంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ లు అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
గ్రీవెన్స్‌కు 298 దరఖాస్తులు


