న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రాధాన్యం
ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తోందని పీఏసీఎస్ చైర్మన్
ఎర్రబెల్లి రఘుపతిరావు తెలిపారు.
దుగ్గొండి: జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం లోటు వర్షపాతం నమోదు అయింది. 50 శాతం లోటు వర్షంతో చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు. చెరువులపై ఆధారపడి చేపలను విక్రయించుకుని బతికే మత్స్యకారులు నేడు ఏ పని దొరకక కుటుంబం గడవని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 706 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులపై ఆధారపడి సుమారు 14 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ప్రతీ సంవత్సరం చెరువులనిండా నీరు ఉండటంతో వాటిలో పెరిగిన చేపపిల్ల లను విక్రయించుకుని సంతోషంగా జీవనం సాగించేవారు. ఈసారి వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లో నీ రు లేక వెలవెలబోతున్నాయి.
191 మత్స్యకార
సహకార సంఘాలు
జిల్లాలో 191 మత్స్యసహకార సంఘాలు ఉండగా 54 మహిళా మత్స్యకార సంఘాలు, 2 గిరిజన సంఘాలు, 1 ఎస్సీ సంఘం, 2 మార్కెటింగ్ సొసైటీలు ఉన్నాయి. సంఘాల ఆధ్వర్యంలో సమష్టిగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
రూ.13.32 లక్షల శిస్తు
జిల్లాలోని చెరువుల్లో మత్స్యకారులు చేపలు పడుతున్నందుకు ప్రభుత్వానికి శిస్తు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులకు గాను ప్రభుత్వానికి ఏడాదికి రూ.13,32,887 శిస్తు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి కోసం ఏటా ఉచితంగా 1.97 కోట్ల చేప పిల్లలను సరఫరా చేస్తుంది. ప్రతీ సంవత్సరం జూలై మాసంలో చేపపిల్లలను చెరువుల్లోకి వదిలేవారు. ఈసారి వర్షాలు లేక చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో చేపపిల్లలను పంపిణీ చేయలేదు.
ఎండిన నాచినపల్లి బతుకమ్మ చెరువు
వలసబాట పడుతున్న కార్మికులు
చెరువుల్లో నీరు ఉంటేనే చేపలు విక్రయించుకుని కుటుంబాన్ని పోషించుకునే వారు. కానీ చెరువులు నిండకపోవడంతో మత్స్యకార్మికులు వలస బాట పడుతున్నారు. కొంతమంది భవన నిర్మాణ కూలీలుగా హైదరాబాద్, వరంగల్ పట్టణాలకు వలస వెళ్తుండగా మరికొంత మంది ఆటోడ్రైవర్లుగా మారుతున్నారు.
జిల్లాలో మొత్తం చెరువులు : 706
మత్స్యసహకార సంఘాలు : 191
మత్స్యశాఖపై ఆధారపడి
జీవిస్తున్న కుటుంబాలు: 14 వేలు
ప్రతీ ఏడా ఉచిత చేపపిల్లల పంపిణీ :
1.97 కోట్లు
వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం జిల్లా మత్స్యకారుల పాలిటశాపంగా మారింది. ఊరి చెరువుల్లో నీరు ఉంటేనే గ్రామం చల్లగా ఉంటుందని, చెరువు లేని ఊరు, ఊరు కాదనేది ప్రా చీన నానుడి. చెరువుల్లో నీరు లేక అన్నదాతలు, మత్స్యకారుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చె రువుపై ఆధారపడి బతికే వేలాది మంది మత్స్యకారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


