క్షయ నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

క్షయ నిర్మూలనకు కృషి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

సంగెం: క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ప్రోగ్రాం అధి కారి డాక్టర్‌ అరుణ్‌ జోషి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో క్షయ (టీబీ) వ్యాధి నివారణపై శిక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చమటలు, ఆకలి మందగించడం, బరువు త గ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకునేలా క్షేత్రస్థాయిలో ఆరోగ్యకార్యకర్తలు, వైద్యసిబ్బంది కీలకంగా పనిచేయాలన్నారు. క్రమం తప్పకుండా వైద్యుల సూచన మేరకు మందులను వాడేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, పల్లె దవాఖాన వైద్యాధికారులు క్రాంతి, రాకేష్‌, లావణ్య, సతీష్‌, శివరాజ్‌, శివకుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement