సమస్యలు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిషోర్‌కుమార్‌ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 243 వినతులు రాగా రెవెన్యూకు సంబంధించినవి 60, జీడబ్ల్యూఎంసీ 84, గృహనిర్మాణ శాఖ 35, ఇతర శాఖలకు సంబంధించినవి 64 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ త్వరగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వై.వి.గణేష్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, హౌసింగ్‌ పీడీ విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాకు న్యాయం చేయాలి..

ఖిలా వరంగల్‌ మండలం ఉర్సు రెవె న్యూ విలేజ్‌ సర్వే నంబర్లు 273, 274, 275, 276లో 50 ఏళ్ల నుంచి స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకు ని మున్సిపాలిటీలో పన్ను కడుతూ ని వాసం ఉంటున్నాం. ఈ నంబర్‌లో 17.05 ఎకరాల భూమి వక్ఫ్‌ బో ర్డుకు చెందినదని కొంది స్థానికేతరులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే అంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాకు న్యాయం చేయాలి.

–ఉర్సు ఎల్లమ్మ తాళ్లు, కుమ్మరి, దళిత వాడ వాసులు

నిత్యావసర వస్తువులు అందించాలి

రేషన్‌ షాపుల్లో 13 రకాల నిత్యావసర వస్తువులను అందించాలి. ధరల పెరుగుదలతో సామన్య ప్రజల జీవితాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలి. ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి.

– ఏఐఎఫ్‌డీడబ్ల్యూ ప్రతినిధులు

‘డబుల్‌’ ఇళ్లు కేటాయించాలి

ఖిలావరంగల్‌ ఎస్సీ వాడ నుంచి చివరి వరకు సుమారు 200 ఇళ్లు రోడ్డు వెడల్పులో నష్టపోయాం. 2016లో అప్పటి ఎమ్మెల్యే కొండా సురేఖ ఇళ్లు, స్థలం కోల్పోయిన బాధితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఇవ్వలేదు. మాకు న్యాయం చేయాలి.

–గద్దల బాబు, ఆశీర్వాదం, గొర్రె రంజిత్‌, వనజ, సుగుణ, ఖిలా వరంగల్‌ ఎస్సీ వాడ

నిధుల దుర్వినియోగంపై

విచారణ జరపాలి

ఖానాపురం మండలం బోటిమీది తండా సర్పంచ్‌ అవగాహన లోపంతో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తూ, పల్లెప్రగతి వనంలో చెట్లను ధ్వంసం చేశారు. గ్రామ కార్యదర్శిపై దాడి చేశారు. ఈ విషయంలో అధికారులకు పలుమార్లు విన్నవించినా.. తగు విచారణ జరగడం లేదు. వెంటనే విచారణ జరిపి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి.

–బోటిమీదితండా వాసులు

అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌

ప్రజావాణిలో 243 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement