ఎంజీఎంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి డీఎంఈ డాక్టర్ వాణి కలియదిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో ఉన్న వైద్యుల వివరాలు, పేషంట్లకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగాల్లో అక్కడక్కడ ఫ్యాన్లు సరిగా తిరుగకపోవడం, లైట్లు కూడా సరిగా లేకపోవడంతో అఽధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంత పెద్దాస్పత్రిలో సమస్యలు ఉంటాయని, అయినా వాటి పరిష్కారం కోసం అధికారులు కృషి చేస్తున్నారు’ అని తెలిపారు. ఎంజీఎంకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. ఆర్‌ఎంఓల కొరత తీరుస్తామన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ శ్రీఎంజీంఎలో ఎక్కువగా స్కానింగ్, ఎక్స్‌రేలకు లోడ్ పడటం వల్ల ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ద్వారా మొబైల్ ఎక్స్‌రే మిషన్, స్కానింగ్ పరికరం కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చాం. అలాగే పూర్తిస్థాయిలో టెక్నిషియన్లను కూడా భర్తీ చేస్తాం. సీఎం ఆదేశాల ప్రకారం నూతన స్పెషాలిటీ భవన నిర్మాణ పనులను అక్టోబర్, నవంబర్ నెలనాటికి పూర్తి చేసి సిద్ధం చేస్తాం అని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఓలు డాక్టర్ మధుకర్ యాదవ్, డాక్టర్ అశ్విని, డీఎంహెచ్‌ఓలు డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


