వర్ధన్నపేట: తాను పేదింటి బిడ్డను. కష్టపడి చదువుకున్నాను. మెడిసిన్‌లో సీటు సంపాదించాను. తనకు సాయం అందించాలని ట్విట్టర్ ద్వారా ఓ విద్యార్థిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అభ్యర్థించగా ఆయన స్పందించారు. వర్ధన్నపేట పట్టణానికి చెందిన అఖిలకు మహేశ్వర వైద్య కళాశాలలో సీటు వచ్చింది. ఈక్రమంలో ఆమె తన భాధను చెప్పుకోగా ఈ నెల 18న ‘సాక్షి’ పత్రికలో ‘ఆపన్న హస్తం అందించరూ!’ అన్న కథనానికి దాతల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఆమెకు సంవత్సరానికి కావాల్సిన ఫీజులు దాతల ద్వారా అందాయి. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సైతం తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించి తన కార్యాలయానికి రావాల్సిందింగా ట్విట్టర్ ద్వారా ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకుని కేటీఆర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. అఖిల మెడిసిన్ చదువుకు మొత్తం తాను ఆర్థిక సాయం అందించి చదివిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. బాగా చదువుకోవాలని అఖిరను కోరారు. అఖిర మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచిన కేటీఆర్, కుటుంబ సభ్యులు, దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


