వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

కృష్ణశిల వచ్చేసింది.. – 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
గణపతికి 1.11 లక్షల ఉండ్రాళ్లతో అభిషేకం

కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట నుంచి 96 టన్నుల కృష్ణశిల రాయి శనివారం కాళేశ్వరానికి చేరుకుంది.

నెక్కొండ: ఆధ్యాత్మికంగా ‘ఉండ్రం’ లేదా ‘మోదకం’ అంటే పరమానందానికి సంకేతమని భావన. అందులో గణేశుడికి ‘మోదకప్రియ’ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఉండ్రంలో వెలుపల బియ్యం పిండి విజ్ఞానానికి ప్రతీక అయితే, లోపల ఉండే పూర్ణం పరమాత్మతత్వం, భక్తికి సంకేతం. అజ్ఞానమనే పొరను తొలగించి, లోపల ఉన్న నిర్మలమైన భక్తిని స్వామికి అర్పించడమే ఉండ్రాళ్ల అభిషేకమని అర్చకుడు బీవీఎన్‌ శాస్త్రి తెలిపారు. మండలం కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో నెక్కొండ ఆర్యవైశ్య సంఘం బాధ్యులు శనివారం 1.11 లక్షల ఉండ్రాళ్లతో గణపతికి అభిషేకం నిర్వహించారు. 50 మంది మహిళలు రెండురోజులపాటు ఉండ్రాళ్లను తయారుచేసినట్లు ఆర్యవైశ్య సంఘం బాధ్యులు తెలిపారు. అలాగే, గణపయ్యను శాకంబరీ రూపంలో అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు తాటిపల్లి శివకుమార్‌, పట్టణ అధ్యక్షుడు దొడ్డ విజయ్‌కుమార్‌, వాసవీ కల్యాణ మండపం అధ్యక్షుడు తాళ్లూరి నర్సింహస్వామి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ మారం రాము, సంఘం ప్రతినిధులు నంగునూరి శివయ్య, దొడ్డ నగేశ్‌, గందె రాజు, చారుకొండ నరేశ్‌, దుబ్బ నాగరాజు, కొమురవెళ్లి సతీశ్‌, వేములపల్లి శ్రావణ్‌, నంగునూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement