హన్మకొండ కల్చరల్: డాక్టర్ చింతపల్లి వసుంధరరెడ్డి జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాసని సురేశ్‌కు ప్రదానం చేశారు. ఈమేరకు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కృష్ణసింధూరి సంకల్ప లలితా కళానిలయంలో డాక్టర్ చింతపల్లి వసుంధరరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆత్మీయ అతిథిగా పమిడికాల్వ మధుసూదన్ పాల్గొని సురేశ్‌కు పురస్కారం ప్రదానం చేశారు. ఈసందర్భంగా సురేశ్‌కు రాష్ట్ర తెలుగు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేశ్, కేయూ విశ్రాంత ఆచార్యులు పాకనాటి జ్యోతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


