హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి ముద్రా, జ్వాలామాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు సుప్రభాతసేవ, నిత్యాహ్నికం క్షీరాన్న నివేదన, చతుష్టానార్చనలు జరిపారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తిని కాళీక్రమమైన ముద్రా అమ్మవారిగా, అమ్మవారి బోగబేరాన్ని షోఢశీక్రమంలో జ్వాలామాలినీగా అలంకరించి పూజలు చేశారు.
9 గంటల నుంచి దర్శనానికి అనుమతి..
ఆషాఢ శుద్ధపౌర్ణమి బుధవారం మితాక్రమంలో అమ్మవారి స్నపనమూర్తిని అలంకరిస్తారు. అమ్మవారి మూలమూర్తిని శాకంబరీగా క్వింటాళ్ల కూరగాయలతో అలంకరించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ రామల సునీత తెలిపారు.
శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి
కూరగాయల వితరణ..
మహబూబాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరసేవా సమితి సభ్యులు, జీకే రెడ్డి అమ్మవారి అలంకరణ కోసం 11 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు మంగళవారం సమర్పించారు. అనంతరం దేవాలయంలో సమర్పించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో మాలలుగా కట్టారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
నేడు మహాశాకంబరీగా
అమ్మవారి అలంకరణ


