ఖిలా వరంగల్: రేషన్‌షాపుల్లో కార్డుదారులు ఈనెల 31లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్‌ఓ) కిష్టయ్య సూచించారు. హనుమకొండలోని వరంగల్ జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో బుధవారం డీలర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎస్‌ఓ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. గతంలో చేసిన వారు అందోళన పడొద్దని, ఈ–కేవైసీ చేయని వారు సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి పూర్తిచేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80 శాతానికి పైగా లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తిచేశారని, మిగిలిన 20 శాతం కార్డుదారులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. గురువారం నుంచి షాపులను తెరిచి ప్రత్యేకంగా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీటీ కిరణ్‌కుమార్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసరఫరాలశాఖ
అధికారి కిష్టయ్య


