సమస్యల పరిష్కారానికే వార్డు సభలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే వార్డు సభలు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

సమస్యల పరిష్కారానికే వార్డు సభలు

పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ పవన్‌

పరకాల: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వార్డు సభలు నిర్వహించనున్నట్లు పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ పోతురాజు పవన్‌ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 1, 2, 9, 11, 13 వార్డుల్లో శనివారం వార్డు సభలు నిర్వహించారు. సంబందిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించిన ఈసభలకు కమిషనర్‌ పవన్‌ హాజరు కాగా, ప్రజలు, స్థానిక వార్డు కౌన్సిలర్లు వార్డుల సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కమిషనర్‌ పవన్‌ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా ఇతర మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డు సభల్లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబాసి వెంకటస్వామి, బొచ్చు శ్యామల, బెజ్జంకి పూర్ణాచారి, గూడెల్లి సదన్‌కుమార్‌, బొచ్చు మాధవిలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement