కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు ముగిసిన డీఈఈసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ మందుల పంపిణీలో నిబంధనలు పాటించాలి ‘యూ–విన్‌’లో నమోదు తప్పనిసరి

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్‌పూర్‌–బెంగళూరు కాంట్‌ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈనెల 12న బిలాస్‌పూర్‌–బెంగళూరు కాంట్‌ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్‌పర, రాయ్‌పూర్‌, దుర్గ్‌, వాడ్స, చాంద్‌ఫోర్ట్‌, బల్లార్షా, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాద్గిర్‌, కృష్ణ, రాయ్‌చూర్‌, మంత్రాలయం రోడ్డు, గుంతకల్‌, గూటి, అనంతపూర్‌, ధర్మవరం, హిందూపూర్‌, ఝెలహంకలో హాల్టింగ్‌ కల్పించారు.

8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డైట్‌, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ)లో ప్రవేశాలకు సెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శనివారం ముగిసింది. వీరు ఈ నెల 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ బి.రంగయ్యనాయుడు కోరారు. అధికారిక వెబ్‌సైట్‌ https://deecet. cdse.telangana.gov.inలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే 9న సవరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 14న మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు డైట్‌ కళాశాలల్లో ఈనెల 17వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్ట్‌ చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం జూలై 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

రామన్నపేట: ఫార్మసీ ఆఫీసర్లు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి వచ్చిన మందులు, పీహెచ్‌సీల నుంచి ఆరోగ్య ఉప కేంద్రాలకు, సిబ్బందికి పంపిణీ చేసిన మందుల బ్యాచ్‌ నంబర్‌, గడువు తేదీ ఇతర వివరాలను సంబంధిత రికార్డుల్లో పక్కాగా నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా వచ్చిన మందులను ముందుగా ఉపయోగించాలని అదేవిధంగా ఏదైనా పీహెచ్‌సీలో తక్కువ వినియోగంలో ఉన్న మందులను దగ్గర్లోని అవసరమైన పీహెచ్‌సీలకు పంపించాలని కోరారు. రాబోయే వర్షాకాలానికి అనుగుణంగా అవసరమైన అన్ని మందులను సరిపడా నిల్వ ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌ సిస్టం దెబ్బతినకుండా వ్యాక్సిన్లను తగిన ఉష్ణోగ్రతలో భద్రపర్చాలన్నారు. ఈ ఔషదీ పోర్టల్‌లో అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు.

వరంగల్‌ డీఎంహెచ్‌ఓ

డాక్టర్‌ సాంబశివరావు

గీసుకొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సంస్థలు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యూ–విన్‌ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.సాంబశివరావు అన్నారు. వరంగల్‌ నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయమై కలెక్టర్‌ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. గర్భిణుల నమోదు, ప్రసవాలు, జనన సమయంలో ఇచ్చే టీకాల వివరాలను యాప్‌లో సకాలంలో నమోదు చేస్తే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. ఏరోజు వివరాలను ఆ రోజు నమోదు చేయాలని సూచించారు. డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement