పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌

సంగెం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ అన్నారు. కాపులకనిపర్తిలో శనివారం ఉపాధి హామీ కూలీలతో, కాట్రపల్లిలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళ కూలీలు పనిచేయాలని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చవద్దని దుక్కిలో కలియదున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎల్‌నిన్‌ ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండేవి సాగుచేసుకోవాలని కోరారు. గొల్లపల్లి, గుంటూరుపల్లి, కాపులకనిపర్తి, కొత్తగూడెం, కుంటపల్లి, లోహితలో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి రమేశ్‌, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ రవీందర్‌, ఏఓలు జగదీశ్వర్‌, రవీందర్‌రెడ్డి, విజ్ఞాన్‌, సర్పంచ్‌లు శ్రావణి, సంధ్య, శ్రీకాంత్‌, చంద్రమౌళి, చేరాలు, సువర్ణ, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement