న్యూస్‌రీల్
హాకీ.. వసతులు హుష్‌కాకి!
వరంగల్ మహానగరంలో హాకీ క్రీడా మైదానం లేకపోవడం, వసతులు కల్పించకపోవడంతో చిన్నారులు మధ్యలోనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.
హన్మకొండ: వేసవిలో వ్యవసాయానికి జలాల వినియోగం తగ్గినప్పటికీ భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే కొద్దిగా పైనే ఉన్నాయి. కొద్ది నెలలుగా చూస్తే రుతు పవనాలకు ముందు మే మాసాంతం నాటికి భూగర్భ జలాలు పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో సగటున మే మాసాంతంలో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాది ఈ మాసాంతంలో 8.55 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2.38 మీటర్లపైనే ఉన్నాయి. రుతుపవనాల అనంతరం నవంబర్ మాసాంతంలో 4.16 లోతులో ఉన్నాయి. నవంబర్ మాసాంతంతో పోలిస్తే మే మాసాంతం నాటికి 2.01 మీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లాలోని నడికూడ మండలం చర్లపల్లిలో అత్యధికంగా 11.20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. భీమదేవరపల్లి జగన్నాథపురంలో 10.10 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈవర్షాకాలంలో వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరింత పడిపోయే అవకాశం
వానాకాలం సాగు ప్రారంభమై భూగర్భ జలాలు తోడితే జూన్ నెలాఖరు వరకు మరింత పడిపోయే అవకాశముందని భూగర్భ జల నిపుణుల అభిప్రాయం. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తుంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తుంది.
గత నెలలో జిల్లా
సగటు 6.17 మీటర్ల లోతు
గతేడాది మేలో జిల్లా సగటు 8.55 మీటర్ల లోతు
నవంబర్‌లో జిల్లా సగటు 4.16 లోతు
ప్రాంతాల వారీగా భూగర్భ జల మట్టం(మీటర్ల లోతులో)
గ్రామం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే
గట్ల నర్సింగాపూర్ 0.68 3.54 4.80 6.00 7.10
జగన్నాథపూర్ 6.4 7.26 8.60 9.40 10.10
కొత్తపల్లి 5.4 6.26 6.70 7.40 9.40
వంగర 7.86 8.1 11.30 7.30 7.90
ధర్మాపూర్ 3.55 4.58 5.30 5.50 6.40
ధర్మసాగర్ 1.61 1.71 1.47 1.81 3.10
పెద్ద పెండ్యాల 2.92 3.23 6.00 7.40 7.93
నారాయణగిరి 3.3 4.35 6.00 4.54 4.92
ఎల్కతుర్తి 5.5 6.54 6.50 7.10 7.40
హనుమకొండ 4.75 4.83 5.30 5.30 6.50
నాగారం 5.3 5.41 5.60 4.70 5.90
సీతంపేట 2.4 2.56 1.64 3.50 5.22
ఎల్లాపూర్ 2.4 2.53 3.40 4.30 4.80
ఐనవోలు 5,65 5.72 4.40 5.30 5.50
పున్నేలు 2.4 2.5 2.77 3.30 4.30
పంథిని 2.75 2.8 3.40 4.90 5.00
శనిగరం 1.75 2.56 3.60 4.90 5.70
పీచర 9.1 12.57 17.80 10.80 8.00
వేలేరు 1.6 2.49 4.00 5.40 6.15
ఆత్మకూరు 2.09 1.8 2.15 1.48 3.20
దామెర 1.6 3.04 4.10 6.50 6.60
చెర్లపల్లి 8.6 9.85 11.80 11.20 11.60
నడికూడ 1.19 1.23 0.80 1.20 2.50
పరకాల 2.82 2.5 2.70 2.70 3.10
పత్తిపాక 2.9 2.2 3.70 4.70 5.90


