ఎరువుల షాపుల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల షాపుల్లో తనిఖీలు

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ఎరువుల షాపుల్లో తనిఖీలు

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని పలు ఎరువులు, విత్తనాల షాపులను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర శుక్రవారం తనిఖీ చేశారు. నిల్వ లు, స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా డీలర్లు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విధిగా రసీదు ఇవ్వాలని చెప్పారు. విత్తనాలను ప్యాకెట్ల రూపంలో మాత్రమే అమ్మాలన్నారు. అలా కాకుండా విడిగా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దామెరలోని ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోకపోతే వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌నుంచి రావాల్సిన నగదు నిలిచిపోతుందని, ఇతర సబ్సిడీలకు కూడా అనర్హులవుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్‌, ఏఈఓ పున్నంచందర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement