ప్రజల భద్రత కోసమే పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రత కోసమే పోలీసులు

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌

గీసుకొండ: ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పించేందుకే పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎలుకుర్తిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వాహనాలపై బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి చేరాలన్నాదే లక్ష్యమన్నారు. యువత మాదక ద్యవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు. తొలుత ఆయన గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు, పోలీసులు పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్‌, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్‌, ఎస్‌ఐ కుమార్‌, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్‌ దివ్యభారతి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌, ఉప సర్పంచ్‌ నల్ల సురేశ్‌, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement