● బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
గీసుకొండ: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ముందస్తుగా హెచ్చరించినా రాష్ట్ర మొద్దు నిద్ర పోతోందని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినోపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగుకు సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. గ్రేటర్ వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీపేరుతో రూ.కోట్ల నిధులు కేటాయించినా ఎక్కడా స్మార్ట్‌గా లేదన్నారు. మురికి, అపరిశుభ్రత ఉందని చెప్పడానికి వరంగల్ కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికై నా నగరాన్ని క్లీన్‌గా, గ్రీన్‌గా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, గట్టికొప్పుల రాంబాబు, జయంత్‌లాల్, రాదారపు శివకుమార్, జాలిగపు ప్రసన్నరాంప్రసాద్, కూతురు రాజు, కొంగర రవి, కంది క్రాంతి కుమార్, గోదాసి అశ్విని, ప్రభాకర్, చంద్రమౌళి, సంకతాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


