వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

– 8లోu

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. పలుచోట్ల వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

మా పోరాటం పాలకులపై..

ఆదివాసీల పోరాటం లంబాడీలపై కాదని.. వారిని చట్టవిరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన పాలకులపై అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌ అన్నారు.

అత్యవసరంగా కావాల్సినవి..

పరికరం సంఖ్య వ్యయం

ఫుల్‌రూమ్‌ డీఆర్‌ ఎక్స్‌రే 2 70 లక్షలు

మొబైల్‌ డీఆర్‌ ఎక్స్‌రే 4 80 లక్షలు

అల్ట్రాసౌండ్‌ 4 1.20 కోట్లు

హారిజొంటల్‌ ఆటోక్లేవ్స్‌ 3 15 లక్షలు

ఓటీ టేబుల్స్‌ 4 16 లక్షలు

సాక్షి, వరంగల్‌: పాతవి కదలవు.. కొత్తవి నడవవు.. అన్నట్లుంది ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితి. ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మా గాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రి, దాని అనుబంధమైన కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాల మొరాయింపు, తరచూ మరమ్మతు, ఏఎంసీ (అన్యువల్‌ మెయింటనెన్స్‌ కాంట్రాక్ట్‌) లేక పనిచేయకపోవడంతో వేలాది మంది రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంజీఎంలో ఉన్న 16 వైద్య యంత్రాల్లో 14 తరచూ మరమ్మతు, రెండు పనిచేయడం లేదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 11 యంత్రాల్లోనూ ఐదు పనిచేయకపోవడం, మూడు మాత్రమే పనిచేయడం, సీఆర్‌ క్యాసెట్ల కొరతతో రెండు, మరొకటి ఏఎంసీ డ్యూ ఉండడం కలవరపెడుతోంది. ఫలితంగా రోగులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేద కుటుంబాలకు ఇది అదనపు ఆర్థికభారం అవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత బుధవారం జరిగిన ఎంజీఎం ఆస్పత్రి డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు రావడంతో ఆరోగ్యశ్రీ రివాల్వింగ్‌ ఫండ్‌లో ఉన్న రూ.8 కోట్లతోనైనా కొత్త పరికరాల కొనుగోలు, పాత యంత్రాల మరమ్మతుకు మార్గం సుగమమవుతుందా! అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోలుకు రూ.4,01,00,000 లు అవసరమవుతాయని, పాత పరికరాల మరమ్మతుకు మిగిలిన నగదును వాడుకోవాలని హెచ్‌డీఎస్‌ కమిటీ నిర్ణయించింది. ఇది సమావేశాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలోకి తీసుకురావడం ద్వారా వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది.

గుండె రోగులకు ఇబ్బందులు

సూపర్‌ స్పెషాలిటీలోని క్యాథ్‌ ల్యాబ్‌ పనిచేయకపోవడంతో గుండెరోగులకు పెద్ద సమస్యగా మారింది. అత్యవసర యాంజి యోగ్రామ్‌, యాంజియోప్లాస్టీ కోసం ఇతర ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీటీ స్కాన్‌ యంత్రం కూడా నిలిచిపోవడంతో ఆస్పత్రి సేవల లక్ష్యం దెబ్బతింటోంది.

ప్రధాన పరికరాల పరిస్థితి ఇలా

పరికరం ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ

ఎంఆర్‌ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు

సీటీ స్కాన్‌ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు)

క్యాథ్‌ ల్యాబ్‌ లేదు 1 (పనిచేయదు)

డీఆర్‌ ఎక్స్‌రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ)

అల్ట్రాసౌండ్‌ 4 (పాతవి, మరమ్మతు) 2

2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది

ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయి

ఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా)

రోజువారీ ఓపీ : 2,000

ఇన్‌పేషంట్లు : 1,000

ఎంఆర్‌ఐ/సీటీ స్కాన్‌ అవసరమయ్యే వారు : 500

ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50

అల్ట్రాసౌండ్‌ అవసరమయ్యే వారు : 200

ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్‌లు: 100లోపు

ఎంజీఎంలో పాత యంత్రాల మొరాయింపు సూపర్‌స్పెషాలిటీలోనూ పనిచేయని కొత్త యంత్రాలు

క్యాథ్‌ ల్యాబ్‌ మూసివేతతో గుండె రోగులకు తప్పని ఇబ్బందులు

కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని

ఎంజీఎం డెవలప్‌మెంట్‌ కమిటీ నిర్ణయం

ఆచరణ రూపంలోకి తీసుకొస్తేనే

రోగులకు మెరుగైన సేవలు

Advertisement
 
Advertisement
Advertisement