మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

సంగెం: మహిళలు కుటుంబ నిర్వాహణకే పరిమితం కాకుండా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదిగేలా చేసి కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మహిళశక్తి వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని మొండ్రాయిలో ముమ్మడివరం, మొండ్రాయి, గొల్ల పల్లి, బాలునాయక్‌తండ, వంజరపల్లి, తిమ్మాపూర్‌లో నర్సానగర్‌, తిమ్మాపూర్‌, గాంధీనగర్‌, కొత్తగూడెం గ్రామాల్లో నిర్మించనున్న మహిళా సమైక్య భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. కుట్టుశిక్షణ ద్వారా మహిళలకు కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ఉద్యోగఅవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్‌డీఓ రేణుక, ఎంపీడీఓ రవీందర్‌, పీఆర్‌డీఈ జ్ఞానేశ్వర్‌, ఏఈ అభిరామ్‌, మహిళ సమైక్య అధ్యక్షురాలు ఉమాదేవి, సర్పంచ్‌లు గూడ స్వరూప, కన్నెబోయిన సంధ్య, నాల్లం వీరస్వామి, నర్సింహనాయక్‌, చందర్‌రావు, వేల్పుల రాజు, రొట్టే శ్రీలత, కోడూరి శ్రీనివాస్‌రావు, గాలి చేరాలు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించి వారికి ఉజ్వల భవిష్యత్‌ను ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మొండ్రాయి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement