నల్లబెల్లి: ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలో ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి అధ్యక్షతన మూడు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను బుధవారం ఆయన ప్రారంభించారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక, ఆర్థిక సమస్యల నుంచి మానవాళికి కమ్యూనిజమే ఏకై క ప్రత్యామ్నాయమన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా నిజాం నిరంకుశ పాలన నుంచి వేలాది గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర సీపీఐ పార్టీకి ఉందన్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా మాట్లాడే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాన్‌కు స్థిరమైన సిద్ధాంతం లేదని, ఆయనకు తెలంగాణ సమాజంలో, రాజకీయాల్లో ఎన్నటికీ స్థానంలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్‌కె బాష్‌మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్, జిల్లా కార్యదర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండా వైపు యువత చూపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు


