బోనమెత్తిన పనికర | - | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన పనికర

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

నెక్కొండ: ముదిరాజ్‌ కుల దైవం పెద్దమ్మ తల్లికి బుధవారం బోనాలతో తరలివెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని పనికర గ్రామంలోని ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన పెద్దమ్మ తల్లికి చీరసారె సమర్పించారు. భక్తులు గ్రామ పురవీధుల గుండా బోనాలతో వెళ్లడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం వనభోజనాలకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కోల వెంకటేశ్వర్లు, పొన్నం వెంకన్న, సింగం కుమారస్వామి, ఎదరబోయిన రాజు, బండారు శ్రీహరి, రవి, కుంట సారయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

బోనాలతో తరలివెళ్తున్న మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement