‘సీకేఎం’లో అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత | - | Sakshi
Sakshi News home page

‘సీకేఎం’లో అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత ఏర్పడింది. మూడు రోజుల నుంచి ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎం, కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, టూడీఈకో పరీక్షల కోసం తీసుకువెళ్లే అంబులెన్స్‌లకు డీజిల్‌ లేదని చెబుతూ చేతులెత్తేస్తున్నారని రోగుల అంటెండెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలు ప్రైవేట్‌ వాహనాల్లో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లు ఆగిపోతే వైద్యసేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబులెన్స్‌లను నడిపించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement