స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. జిల్లాలో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా 14 సంవత్సరాలు అందరూ కలిసికట్టుగా ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వంటావార్పు, బతుకమ్మ ఆట, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. నిరంతర రిలే దీక్షలు చేపట్టి రికార్డు సృష్టించారు. నర్సంపేటలోని అంబేడ్కర్ సెంటర్‌లో 400 రోజులు, దుగ్గొండి మండలం గిర్నిబావిలో జేఏసీ ఏర్పాటు చేసుకుని 203 రోజులు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. – నర్సంపేట/దుగ్గొండి
స్వరాష్ట్రం కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు
నర్సంపేట, గిర్నిబావిలో
రిలే దీక్షలు, ర్యాలీలు


