● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
సంగెం: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సాకారం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌లో పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆయన సన్మానించి మాట్లాడారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ, హౌసింగ్ పీడీ రాంరెడ్డి, డీఈలు కిషన్, విష్ణువర్ధన్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఏఈ సంధ్యారాణి, సర్పంచ్‌లు వేల్పుల రాజు, శ్రీనివాస్‌రావు, చేరాలు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవికుమార్, నాయకులు రమేశ్, ఉడుత అనిల్, సారంగం ఉన్నారు.
ఎత్తిపోతల పనుల పరిశీలన
గీసుకొండ: కొనాయమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులను ప్రాజెక్టు పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.


