కాళోజీ సెంటర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు ఖిలా వరంగల్ ఖుష్ మహల్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ప్రశంసపత్రాలు అందజేశారు. రాయపర్తి మండలం కొండూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం, సంగెం మండలం గవిచర్ల మోడల్ స్కూల్, ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు ప్రశంసపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఈఓ డి.రంగయ్యనాయుడు, ఎన్‌జీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ సుజన్ తేజ తదితరులు పాల్గొన్నారు.


