● జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం
అధ్యక్షుడు దండ నరేష్
సంగెం: గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దండ నరేష్ అన్నారు. సంగెం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఉప సర్పంచ్‌లకు ప్రత్యేక విధులు అప్పగించడంతో పాటుగా గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం ఉపసర్పంచ్‌ల మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా ఆగపాటి రాజు (సంగెం), వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాల ఉమేష్ (వెంకటాపూర్), ప్రధాన కార్యదర్శి గుమ్మడి సంపత్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


