ప్రపంచ యవనికపై వరంగల్‌ ‘5ఎఫ్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ యవనికపై వరంగల్‌ ‘5ఎఫ్‌’

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

ఫామ్‌ టు ఫైబర్‌ నినాదంతో గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీ గ్రామంలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల పీఎం మిత్ర పథకం రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. కై టెక్స్‌, ‘ఎవర్‌టాప్‌ టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ కాంప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, యంగ్‌వన్‌, గణేశా కంపెనీలు వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement