ఖిలా వరంగల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ ప్రాంగణం సర్వం సిద్ధమైంది. సోమవారం డిప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యశారద ఏర్పాట్లను పరిశీలించారు. ఖుష్‌మహల్, రాతికోట ముఖద్వారం, చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అమరవీరుల స్థూపాన్ని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్‌దీపాలతో అలంకరించారు. నేడు (మంగళవారం) జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయజెండాను ఆ విష్కరించనున్నారు. ఉత్తమ అధికారులను అభినందించి ప్రశంసాపత్రాలను అందించనున్నారు. కాగా సీపీ సత్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం డి ప్యూటీ సిటీ పోలీస్ కమిషనర్ అంకిత్‌కుమార్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి కట్టిదిట్టమైన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్‌లో కమాండెంట్ పర్యవేక్షణలో మాక్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి, ఎస్సైలు, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇలా..
నేడు ఉదయం 7 గంటలకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రా రంభంకానున్నాయి. ఉదయం 7:45 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులు, 8 గంటలకు జెండా ఆవిష్కరణ, 8:15 గంటలకు పరేడ్, 8:25 గంటలకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరణ, 8:30 గంటలకు జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి ప్రసంగం, 9:15 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9:30 గంటలకు అమరవీరుల కుటుంబాలు సన్మానం, 9:40 గంటల స్టాళ్ల సందర్శన ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
నేడు ఖుష్‌మహల్ ప్రాంగణంలో ఆవిర్భావ వేడుకలు
పనులను పరిశీలించిన
కలెక్టర్ సత్యశారద
జాతీయజెండాను ఆవిష్కరించనున్న మంత్రి సురేఖ


