కాళోజీ సెంటర్: జిల్లా సంక్షేమశాఖ (డీడబ్ల్యూఓ) కార్యాలయంలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల నిబంధనల మేరకు మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పలువురు ఉద్యోగులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీడబ్ల్యూఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్‌ను నర్సంపేట సీడీపీఓ కార్యాలయానికి బదిలీ కాగా ఆయన స్ధానంలో వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లిఖితను వరంగల్ డీడబ్ల్యూఓ కార్యాలయానికి బదిలీ చేయగా ఆమె స్థానంలో నర్సంపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రమాదేవిని వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే వరంగల్ సీడీపీఓ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డిని మాత్రం అదేస్ధానంలో రిటెన్షన్ ఇస్తూ కొనసాగించారు. వరంగల్ డీడబ్ల్యూఓ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ లావణ్యను నర్సంపేట సీడీపీఓ కార్యాలయానికి, వరంగల్ సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న మహ్మద్ ఇర్షత్‌ను డీడబ్ల్యూఓకు బదిలీ చేశారు. వర్ధన్నపేట సీడీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్టు భగవత్‌ను వరంగల్ సీడీపీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆదివారం సెలవు కావడంతో వారందరికి ఈమెయిల్ ద్వారా ఆర్డర్స్ పంపారు.


