పొగాకు ఉత్పత్తులను నియంత్రించాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు ఉత్పత్తులను నియంత్రించాలి

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు

కాశిబుగ్గ: పొగాకు ఉత్పత్తులను వాడటంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రతీ పౌరుడు అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు అన్నారు. ఆదివారం ప్రపంచ పొగాకు డే సందర్భంగా ఎంజీఎం నర్సింగ్‌ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వివిధ శాఖల సమన్వయంతో పోగాకు వాడటం వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పొగాకు రహిత సమాజం నిర్మించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఇక్తాదర్‌ అహ్మద్‌, నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె.విజయ, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, నర్సింగ్‌ ట్యూటర్స్‌ చందామణి, వినోద, ప్రోగ్రాం సూపర్‌వైజర్లు సోమేశ్వర్‌, ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement