నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

న్యూశాయంపేట: సమీకృత జిల్లా కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. ఆదివారం వరంగల్‌ ఆజంజాహి మిల్‌ మైదానం ఓసిటీలో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటడంతో పాటు సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ వెంట వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, కాంట్రాక్టర్‌, అధికారులు ఉన్నారు.

నేడు ప్రజావాణి

న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను ప్రజావాణిలో అందించాలని కోరారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

స్పందిస్తున్న సహృదయులు

శ్రుతి, సౌమ్యకు రూ.50వేల ఆర్థికసాయం

దుగ్గొండి: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఇద్దరు అమ్మాయిలను ఆదుకోవడానికి సహృదయులు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో జిర్ర రాజు, కవితలు ఇద్దరు చనిపోవడంతో అనాథలుగా మిగిలిన శ్రుతి, సౌమ్యల దీనగాథను వివరిస్తూ ‘అనాథలు..ఆగని కన్నీటి ధారలు’ శీర్షికన మే నెల 30 (శనివారం)న సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈ మేరకు పలువురు తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రూ.50 వేల వరకు విరాళాలు అందాయి. అయితే వచ్చిన కొద్దిపాటు డబ్బు ఇద్దరు పిల్లల చదువుకు సరిపడవని, వారిద్దరి చదువులు పూర్తి అయ్యేంత వరకు సరిపోయే విధంగా ఆర్థికసాయం అందించాల్సిన అవసరం ఉందని, దాతలు ముందుకు రావాలని ముదిరాజ్‌ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫేషనల్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్‌ పిలుపునిచ్చారు. ఇప్పటికి విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అగ్నివీర్‌కు సైనిక్‌

విద్యార్థుల ఎంపిక

ఖానాపురం: అగ్నివీర్‌కు సైనిక్‌స్కూల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ గట్ల సురేందర్‌ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆలం రాహుల్‌, భూక్య కౌశిక్‌, మరిపెడ్డి సందీప్‌, శివగణేష్‌, ద్వితీయ సంవత్సరం నుంచి విస్లావత్‌ అనిల్‌, జర్పుల అనిల్‌, బానోతు అరవింద్‌, ప్రథమ సంవత్సరం నుంచి పృథ్వీరాజులు ఎంపికయ్యారు. భారత సైన్యంలో సేవలందించే అవకాశం రావడం సంతోషకరమన్నారు. విద్యార్థులు సైనిక్‌స్కూల్‌లో అందించే శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ దామోదర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర సదస్సును

జయప్రదం చేయాలి

నర్సంపేట: జూన్‌ 28వ తేదీన జరిగే భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా బొజ్జాతారకం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని పాత ఎమ్మార్వో ఆఫీస్‌ ఆవరణలో ఆదివారం రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మనువాద బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి మనువాద రా జ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్న కుట్ర లను తిప్పి కొడుతూ భారత రాజ్యాంగాన్ని కా పాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వర రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావుడియా మధుకర్‌నాయక్‌, గునిగంటి రమేష్‌, నాలిక యుగంధర్‌, కొండి రాజు, మంచాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement