విద్యతోనే ఉన్నత స్థానం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉన్నత స్థానం

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నర్సింహారెడ్డి

విద్యార్థులకు ప్రతిభా అవార్డుల పంపిణీ

సంగెం: విద్యతో పాటు సంస్కారం ఉంటేనే విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి లింగాల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీందర్‌నాయక్‌తో కలిసి ప్రతిభ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలన్నారు. విద్య తపస్సు లాంటిదని సరియైన రీతిలో వినియోగించుకుని సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బానోత్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఏసీపీ సురేందర్‌, మంగపేట తహసీల్దార్‌ తోట రవీందర్‌, సర్పంచ్‌లు పేర్ల లలిత, పెంతల సువర్ణ, కోడూరి శ్రీని వాస్‌ రావు, ప్రతిభ ఆవార్డుల నిర్వహకుడు పులి రాజశేఖర్‌, దాతలు కోటేశ్వర్‌, లింగమూర్తి, ఉమాశంకర్‌, సురేష్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement