డీఏఓగా వి.విజయచంద్ర | - | Sakshi
Sakshi News home page

డీఏఓగా వి.విజయచంద్ర

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

డీఏఓగా వి.విజయచంద్ర సర్టిఫికెట్ల పరిశీలన కేయూ ఎంసీఏ సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు పనులు పూర్తి చేయాలి నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ కులవర్గ విభేదాలు విస్మరించాలి

హన్మకొండ : హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా వి.విజయచంద్ర (వి.జోజప్ప)ను ప్రభుత్వం నియమించింది. బదిలీల్లో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ సహాయ సంచాలకులుగా పని చేస్తున్న విజయచంద్రను హనుమకొండకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న రవీందర్‌ సింగ్‌ ఆదిలాబాద్‌ డీఏఓగా బదిలీ అయ్యారు.

విద్యారణ్యపురి : డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్‌– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్‌కు ర్యాంక్‌ కార్డు, హాల్‌టికెట్‌, టెన్త్‌, ఇంటర్మీడియట్‌ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయ, టీసీ, ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌, పీహెచ్‌సీ పత్రాలతో రావాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు (సీబీసీఎస్‌), (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిం ఇక్బాల్‌ తెలిపారు. 8న మొదటి పేపర్‌, 10న రెండో పేపర్‌, 12న మూడో పేపర్‌ పరీక్షలు ఉంటా యన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉ దయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

న్యూశాయంపేట: సమీకృత జిల్లా కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. వరంగల్‌ ఓసిటీలో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులు, నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, కాంట్రాక్టర్‌, అధికారులు ఉన్నారు.

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో సోమవారం గ్రీవెన్‌ సెల్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హన్మకొండ కల్చరల్‌ : కులవర్గ విభేదాలను విస్మరించాలని చిన్మయానంద మిషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీసువిరానందస్వామి ఉద్బోధించారు. ఆదివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్మయ మిషన్‌ స్థాపించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement