వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు మరింత బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సైగా పదోన్నతి పొందిన సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్సైగా పదోన్నతి పొందిన రాజేంద్రప్రసాద్ ఆదివారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పోలీసు కమిషనర్ పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.


