బాలికలదే హవా | - | Sakshi
Sakshi News home page

బాలికలదే హవా

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 52.81 శాతం

సెకండ్‌ ఇయర్‌లో 60.80శాతం ఉత్తీర్ణత

మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

కాళోజీ సెంటర్‌: ఫిబ్రవరి మాసంలో జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు అధికారులు ఆదివారం విడదల చేశారు. ఈ మేరకు జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,678 మందికి 2,844 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాఽధించి 60.80 శాతంలో నిలిచారు. ఇందులో బాలురు 1,824 మందికి 776 మంది పాసయ్యారు. బాలికలు 2,851 మందికి 2,068 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే ఒకేషనల్‌ కోర్సులో మొత్తం 737 మందికి 545 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 251 మందికి 142 మంది, బాలికలు 486 మందికి 403 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరంలో మొ త్తం 5,211 మందికి 2,752 మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 2,133 మందికి 726 మంది విద్యార్థులు, బాలికలు 3,078 మందికి 2,026 మంది ఉత్తీర్ణులు కాగా 52.81 శాతంలో నిలిచారు. ఒకేషనల్‌ కోర్సులో మొత్తం 793 మందికి 428 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 269 మందికి 83 మంది, బాలికలు 524 మందికి గాను 345 మంది ఉత్తీర్ణత (53.97 శాతం) సాధించారు.

20వ తేదీ వరకు రీ కౌంటింగ్‌

ఇంటర్‌ వార్షిక ఫలితాల్లో ఏమైన అభ్యంతరాలు ఉంటే రీ కౌంటింగ్‌ లేదా రీ వెరిఫికేషన్‌ చేయించుకోవాలనుకునే విద్యార్థులు ఈనెల 13 నుంచి 20వ వరకు టీజీబీఐఈ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు ప్రతీ సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీ వెరిఫికేషన్‌, స్కాన్‌ కాపీ కోసం ప్రతీ సబ్జెక్టుకు రూ.800 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

– డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌, డీఐఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement