చేనేత జౌళి శాఖ అదనపు
డైరెక్టర్ విజయలక్ష్మి
శాయంపేట: మహిళలు సంప్రదాయ వృత్తి అయిన చేనేతను కాపాడుకోవాలని చేనేత జౌళి శాఖ అదనపు డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘంలో నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ సహాయ సోషల్ సర్వీస్ సేవా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.సువిధ చేనేత శిక్షణ పొందిన మహిళలకు శనివారం నాబార్డ్ సహాయ ఎన్‌జీఓ కార్యదర్శి విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీ విజయలక్ష్మి హాజరయ్యారు. మహిళలు చేనేత రంగాన్ని కాపాడుకుంటూ ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని వినూత్న డిజైన్లతో చీరలు, టవెల్స్ తయారు చేయాలని సూచించారు. అనంతరం నేతన్న భరోసా పథకం కింద వచ్చిన రూ.3లక్షల 25వేల 500 చెక్కును, చేనేత రుణమాఫీ పథకం కింద రూ.9 లక్షల చెక్కును కార్మికులకు అందజేశారు. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎం.సువిధ నాబార్డ్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మండల పరుశురాములు, సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, టెస్కో ప్రతినిధి వెంకటేశ్వర్లు, చేనేత అభివృద్ధి అధికారి సునీత, మాస్టర్ ట్రైనర్లు మురళి, జనార్దన్, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.


