హన్మకొండ: కృత్రిమ మేధను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ.. ప్రతీ విభాగంలో కృతిమ మేధ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. కృతిమ మేధ అమలు ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన సేవలు అందించడమే ఎన్పీడీసీఎల్ లక్ష్యమన్నారు. సమావేశంలో డైరెక్టర్ వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదర్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్‌లాల్, తిరుమల్‌రావు, రాజుచౌహాన్, జయంత్‌రావు, అశోక్, సురేందర్, వెంకటరమణ, మాధవరావు, అన్నపూర్ణ, సీజీఎంలు చరణ్‌దాస్, కిషన్, జీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో 64 పరీక్ష కేంద్రాల్లో బుధవారం టెన్త్ విద్యార్థులకు హిందీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 12,037 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 12,021 మంది హాజరైనట్లు (99.87 శాతం)డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. 16 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్ 5 పరీక్ష కేంద్రాలను, డీఈఓ కార్యాలయం ఏసీజీఈ భువనేశ్వరి నాలుగు పరీక్ష కేంద్రాలను, నాలుగు ఫ్లయింగ్‌స్క్వాడ్లు 23 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
కేయూ క్యాంపస్: చైన్నెలోని జాయ్ వ్యవసాయ అగ్రిటెక్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 26, 27వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డికి ఆహ్వానం అందింది. వ్యవసాయ ఆర్థిక శాస్త్రం – సుస్థిర అభివృద్ధి అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సదస్సులో ఆయన సమర్పించనున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి బుధవారం తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆధునిక అగ్రిటెక్ విధానాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై చర్చలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించనున్నారని జ్యోతి వివరించారు.
హన్మకొండ చౌరస్తా: ఈనెల 22వ తేదీన హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ చదరంగం టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలన్నారు. టోర్నమెంట్ బ్రోచర్లను హనుమకొండ ఏసీపీ నరసింహరావు చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఐదేళ్ల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండియర్ విద్యార్థి శ్రీవిద్య ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు మృతికి సంతాపకంగా కేయూలోని కెమిస్ట్రీ విభాగంలో విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి, అధ్యాపకులు బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీవిద్య చిత్రపటానికి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్లు శ్రీనివాస్, సుమలత నివాళులర్పించారు.


