సర్కార్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం

Mar 19 2026 10:32 AM | Updated on Mar 19 2026 10:32 AM

సర్కార్‌ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం నైపుణ్యాలు పెంపొందించేందుకే ‘స్ఫూర్తి’

హసన్‌పర్తి: సర్కార్‌ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం హసన్‌పర్తి ప్రాథమిక ఆస్పత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు ఈ శిబిరంలో వైద్యసేవలు అందించారు. ఈకార్యక్రమానికి డాక్టర్‌ అప్పయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడితే వెంటనే స్థానిక ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె దవాఖాలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈసందర్భంగా 408 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందిచారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుమనవాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, స్థానిక మండల వైద్యాధికారి రామ్‌, భార్గవ్‌, వైద్యులు భరత్‌రెడ్డి, కృతిక, ప్రహసిత్‌, సురేశ్‌, క్రాంవతి, మానస, మల్లేశం, విజయ, సాయి, స్థానిక కార్పొరేటర్‌ గురుమూర్తి శివకుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

వరంగల్‌: విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం వరంగల్‌ దేశాయిపేటలోని ప్రభుత్వ సీకేఎం కళాశాలలో నిర్వహించిన ‘స్ఫూర్తి’ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ సీఈఓ రాంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ధర్మారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే లక్ష్యాన్ని సాధించగలరని అన్నారు. భయాన్ని జయిస్తే విజయాన్ని అందుకోవడం సులభమవుతుందని, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల 6వ నుంచి 8వ తరగతి విద్యార్థులతో కలెక్టర్‌ ముచ్చటించారు. విద్యార్థులు ఒత్తిడి, పోటీ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement