వరంగల్ అర్బన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్లానిటోరియాన్ని పునరుద్ధరిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్లానిటోరియం సివిల్ పనులపై విదేశీ ప్రతినిధులతో మేయర్ సమీక్షించారు. నిర్మాణ పనులకు సంబంధించి డోమ్ నిర్మిత పనులను మేయర్ పరిశీలించారు. ఎక్విప్‌మెంట్ ఏర్పాటుతో పాటు సాంకేతిక (మెకానికల్) పనులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈ సంతోశ్‌కుమార్, ఏఈలు సరిత, నరేశ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్‌కు 5 రెఫరెల్
ఆస్పత్రులు మంజూరు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కుటుంబాలు, ఉద్యోగులు, పెన్షనర్స్‌కు ఉగాదిని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే రెఫరెల్ ఆస్పత్రులను మంజూరు చేస్తూ అనుమతిచ్చింది. కాజీపేట రైల్వే ఆస్పత్రికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని 5 ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫరెల్ అనుమతులు ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు బుధవారం కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ కో–ఆర్డినేటర్ నాయిని సదానందం తెలిపారు. సదానందం ఆధ్వర్యంలో రైల్వే మజ్దూర్ యూని యన్ నాయకులు రైల్వే డాక్టర్లు నిరంజన్, నరేందర్, యాకూబ్, వినయ్‌బాబు, దీపను సన్మానించారు. కార్యక్రమంలో రైల్వేమజ్దూర్ యూనియన్ నాయకులు పాక వేదప్రకాశ్, ఆర్.సమ్మయ్య, కాజీపేట సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌యాదవ్ అన్ని బ్రాంచీల ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ వారు పాల్గొన్నారు.


