దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి

Mar 19 2026 10:32 AM | Updated on Mar 19 2026 10:32 AM

నయీంనగర్‌: దళితులకు అంబేడ్కర్‌ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్‌ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్‌) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్‌ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితులకు అంబేడ్కర్‌ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేత రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్‌ ముందుంటుందని చెప్పారు. ఉపేందర్‌ మాదిగ, వెజ్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ జకార్య, వీరేందర్‌, ప్రభాకర్‌, గోపి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement