మహర్షి గోశాలకు సహకారం అందిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

మహర్షి గోశాలకు సహకారం అందిస్తాం..

Mar 15 2026 4:51 AM | Updated on Mar 15 2026 4:51 AM

మహర్షి గోశాలకు సహకారం అందిస్తాం..

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హసన్‌పర్తి: మహర్షి గోశాలలో గోఆధారిత ఉత్పత్తులు తయారుచేయడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. చింతగట్టులోని మహర్షి గోశాల చారిటబుల్‌ ట్రస్ట్‌, ఎస్‌ఆర్‌ఎం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంచగవ్య ఉత్పత్తుల తయారీ శిక్షణ శిబిరాన్ని శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. గోవులకు మేత వేసి మాట్లాడారు. మహర్షి గోశాలకు సహకారం అందిస్తామన్నారు. పొద్దుటూరులోని సురభి గోశాల ప్రతినిధి దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ కోసం 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మహర్షి గోశాల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు సర్జన రమేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర గోశాల సేవా సమితి సభ్యుడు ఆకుతోట రామారావు, చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు యుగేంధర్‌, యాదగిరి, స్వామి నారాయణ, ప్రొఫెసర్‌ కేశవరావు, డి.కిషన్‌రావు, జయ, మలహర్‌రావు, నాగ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement