పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణ షురూ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 16 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు రెండో విడత కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ట్రైనింగ్ (ఐసీటీ)పై గురువారం శిక్షణ ప్రారంభించారు. విద్యార్థులకు కంప్యూటర్ బోధించేందుకు ఐసీటీపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. గూగుల్ స్టోర్, గూగుల్ షీట్, గూగుల్ డాక్యుమెంట్ తదితర కంప్యూటర్ సంబంధిత ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ మన్‌మోహన్ తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన డీఆర్పీలు రెండు రోజుల్లో 185 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ధార్మిక భవన్‌లోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భద్రకాళి ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యాం, దేవాదాయశాఖ సిబ్బంది తదితరులు డీసీ రామల సునీతను శాలువాతో సత్కరించారు. అలాగే, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వీరన్న, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం, డిస్ట్రిక్ట్ గవర్నర్ మంచాల విజయ్‌కుమార్ తదితరులు సునీతకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును అమలు చేస్తున్న విషయం విదితమే. ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా అధ్యాపకులతో గత ఏడాది సెప్టెంబర్‌లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొనసాగింపుగా ఈనెల 23న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి, 25 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 2,689 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 2,018 మంది విద్యార్థులు చదువుతున్నారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 1,200 మంది సెకండియర్‌లో 1,150 మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులు తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్‌లో గురువారం పోస్టర్‌ను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్‌లాల్, ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, చంద్రకళ, వీఎస్ నరేందర్, కుమారస్వామి, ఎంకే సుమంత్, శంకర్ పాల్గొన్నారు.
పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణ షురూ
పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణ షురూ


