శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులను అందజేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. వార్షిక ఫైరింగ్ సాధనలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ సిబ్బందితో పాటు శాంతి భద్రతలకు చెందిన పోలీస్ అధికారులు రెండు రోజులుగా ధర్మసాగర్ మండల కేంద్రం శివారు ప్రాంతంలోని ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సీపీ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు పోలీస్ అధికారులు పాల్గొని వివిధ రకాల తుపాకులతో సాధన చేశారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌కుమార్, కవిత, రాజమహేంద్రనాయక్, ఏఎస్పీలు చేతన్, శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, బాలస్వామి పాల్గొన్నారు.


