బీజే పీ జిల్లా కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

బీజే పీ జిల్లా కమిటీ నియామకం

Jan 13 2026 7:20 AM | Updated on Jan 13 2026 7:20 AM

బీజే

బీజే పీ జిల్లా కమిటీ నియామకం

గీసుకొండ: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారి జీ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా పదాధికారుల నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గడల కుమార్‌, బైరి నాగరాజు, పి.యాకాంతం గౌడ్‌, కందిమల్ల మహేష్‌, రేసు శ్రీనివాస్‌, అజ్మీరా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులుగా బాకం హరిశంకర్‌, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, బన్న ప్రభాకర్‌, కార్యదర్శులుగా గోకె వెంకటేశ్‌, మిట్టపల్లి కపిల్‌కుమార్‌, దువ్వ నవీన్‌, గుడిపుడి రాధాకృష్ణ, రాయబారపు కుమారస్వామి, మంద శ్రీనివాస్‌, కోశాధికారిగా గుర్రాల సరితచంద్రమౌళి, ఆఫీస్‌ సెక్రటరీగా కంది రజిత క్రాంతికుమార్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌గా నోముల రతన్‌, మీడియా కన్వీనర్‌గా అనకాల జనార్దన్‌, ఐటీ ఇన్‌చార్జ్‌గా ఆడెపు సృజన వెంకటేష్‌లను నియమించినట్లు పేర్కొన్నారు.

ఒకే జిల్లాగా చేయాలి

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను ఒకే జిల్లాగా చేయాలని టీఎన్జీఓస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ ఆకుల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని టీఎన్జీఓస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లాల విభజన అశాసీ్త్రయంగా జరిగిందని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఆరు జిల్లాలు చేయడం వల్ల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానికత కోల్పోయి, కుటుంబాలకు దూరంగా, ప్రమోషన్లలో సీనియార్టీ కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాల విభజన ఆధారంగా చేసిన జోనల్‌ విధానం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు వివిధ జిల్లాలకు మరియు జోన్లకు కేటాయించడం వల్ల వారి సర్వీస్‌లో పరిష్కారం కాని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలు భౌతికంగా కలిసే ఉన్నాయని ఈ రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రజలకు, ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను కలపడాన్ని టీఎన్జీఓస్‌ యూనియన్‌ స్వాగతిస్తొందని పేర్కొన్నారు.

గంజాయి స్వాధీనం

నర్సంపేట రూరల్‌: పోలీసులు మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం ఏసీపీ రవీందర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. చెన్నారావుపేట మండలంలోని అక్కల్‌చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్‌ ఛత్తీస్‌గఢ్‌లో తక్కువ ధరకు ఎండు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధర అమ్మేందుకు తీసుకొన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కల్‌చెడ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 3 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్‌, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

బీజే పీ జిల్లా కమిటీ నియామకం
1
1/1

బీజే పీ జిల్లా కమిటీ నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement