చెన్నకేశవస్వామి జాతర షురూ
నర్సంపేట రూరల్: సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకోని చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలోని గుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర మంగళవారం ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రామాచార్యులు, వేద పండితులు భరత్ వాజ్, విశ్వక్సేన ఆరాధన పూజలు నిర్వహించారు. దొడ్డ విజయ్‌కవిత, ఉడుత సాంబశివుడు అన్నపూర్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ మెడబోయిన రజిత కుమార్, మాదార పు భాస్కర్, పరకాల రాజన్న, చీకటి వెంకటేశ్వర్లు, బూర్గు సూరయ్య, సప్పిడి ప్రియాంక, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోట కబ్జాలపై సర్వే
సాక్షి, వరంగల్: ఓరుగల్లు కోటకు కబ్జా బీటలు.. కో టను కాపాడితేనే భవి ష్యత్ అంటూ సాక్షిలో వచ్చిన వరుస కథనా లపై జిల్లా యంత్రాంగం కదలింది. ఈ కోటకు సంబంధించి 377.8 ఎకరాల భూమిలో సరిహద్దులతో పాటు ఆక్రమణలను గుర్తించేందుకు కేంద్ర పురావాస్తు శాఖ, రెవెన్యూ అధికారుల ప్రత్యేక బృందాలు సంయుక్త సర్వే చేయనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా రెవెన్యూ విభాగాధికారి తెలిపారు. 50.13 ఎకరాల్లో రాతికోట, 169.10 ఎకరాల్లో మట్టికోట, 157.25 ఎకరాల్లో మాన్యుమెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావాస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం... పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. అయితే ఈ నిబంధనలు అతిక్రమించిన వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుండనున్నాయి.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
దుగ్గొండి: పట్టాదారు పాసుపుస్తకం గల ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని వెంకటా పురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్, బ్యాంక్ రుణాలు, త్వరలో రానున్న పంటల బీమా పథకం సులభతరంగా, ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అందుతాయన్నారు. రైతులు తమ సమీపంలోని మీసేవా కేంద్రంలో గాని, ఏఈఓల వద్ద గాని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ గాజుల శ్యామ్, రైతులు దూలం గోవర్ధన్, మూన్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
పర్వతగిరి: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజావ్యతిరేక విధానాలపై పో రాడాలని తెలంగాణ రైతు సంఘం, సీఐటీ యూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో జీపు జాతా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17, 18, 19 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే జీపు జాతా, 19వ తేదీన వరంగల్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఎ న్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వినాశకరమైన నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్ యజమానులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోడేటి దయాకర్, సీఐటీయూ మండల కార్యదర్శి జిల్లా రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నా యకులు మాదాసు యాకుబ్, నకరకంటి రామచందర్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నకేశవస్వామి జాతర షురూ
చెన్నకేశవస్వామి జాతర షురూ


