గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్‌లో నిజాం కాలం నుంచి విక్రయాలు
ఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్‌లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు.
2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం..
2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం..
వరంగల్ ఎల్లంబజార్‌లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది.
–చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్
మా షాపునకు వందేళ్ల చరిత్ర..
సురాజ్ మాల్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్‌సేల్, రిటైల్‌గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్‌చంద్, వ్యాపారి
పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి.
నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి.
చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు.
జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి.
పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది.
పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు.
గాలిపటమా పద పద..
గాలిపటమా పద పద..
గాలిపటమా పద పద..


